Friday, May 1, 2015

ఆరవ వార్షికోత్సవం

        పాఠశాల మొదలుపెట్టి ఆరు సంవత్సరాలు పూర్తయిందంటే నమ్మశక్యంగా లేదు. తెలుగులో ఒక్క అక్షరం పలకలేని పిల్లలు ఈరోజు మాట్లాడుతున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మొదలు పెట్టినప్పుడు పుస్తకాలు లేవు, ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో తెలీదు. అలాంటిది ఇవాళ మాకై మేము సొంతంగా పాఠ్యాంశాలను రూపొందించుకుని పాఠాలు చెప్పగలగడమే కాక, పాఠాలు చెప్పాలన్న ఉత్సాహంతో ముందుకు వచ్చిన వారికి ప్రణాళిక ఇవ్వగలిగే స్థాయికి వచ్చినందుకు ఎంతో గర్వంగా ఉంది. 

ఇన్ని సంవత్సరాలు అర్ధరాత్రి, అపరాత్రి అని లేక ఫోన్ చేసినా విసుక్కోక నన్ను భరించి నాతో నడిచిన ఉపాధ్యాయులు, మీరివన్నీ మీ పిల్లలతో చేయించాలంటే ఎందుకు ఏమిటి అని అడక్కుండా తూ. చా. తప్పకుండా పాటించిన తల్లిదండ్రులు, పద్యాలు, పాటలు, ఆటలు, మాటలు అన్నీ నేర్చిన చిన్నారులు, నాలుగు తరగతులు పూర్తి చేసి పాఠశాలను ప్రగతి పథం వైపు నడిపిస్తున్న పట్టభద్రులు అందరూ ఈ విజయంలో భాగస్వాములే. 


ఆరవ వార్షికోత్సవం విశేషాలు ఇక్కడ చూడొచ్చు. . 

Friday, November 14, 2014

ఐదవ వార్షికోత్సవం

5వ వార్షికోత్సవం వీడియోలు 

యాంకర్ వెంకట్ గారి మాటల్లో 

ఉపాధ్యాయులు రఘు, జ్యోతిర్మయి, మంజుల, రాజశ్రీ, రాధ, అనురాధ, స్నేహ, సుమతి, లావణ్య, శైలజ  ఏమంటున్నారంటే 

విద్యార్ధుల నాటికలు

రూట్స్

అమ్మమ్మగారు అమెరికా ప్రయాణం
దసరా సంబరాలు
చిత్రాలు,

Monday, September 8, 2014

కథలు

ఒకటవ తరగతి కథలు 
 1. "టీ కప్పు ఆత్మ కథ" ---  స్వేచ్చానువాదం చిన్ని 
 2. బద్దకం నుండి విముక్తి  --- పి పుల్లారావు 
 3. "గాడిద గర్వం" 
 4. "ఉపాయం"  
 5. "కోతలు కోసిన కోయిల". --- గుడిపూడి రాధికా రాణి 
 6. "కోడిపుంజు తెలివి". 
 7. "కట్టెలు కొట్టువాడు బంగారు గొడ్డలి". .
 8. "కనువిప్పు"
 9. "మూడు బొమ్మలు".---- చిరంజీవి సుభాష్ 
 10. "కోపం వచ్చిన చీమ".---- చిరంజీవి షర్మిల 
 11. ఈగ.  
 12. "కుదురులేని కుంకుడు గింజ". గుడిపూడి రాధికా రాణి 
 13.  షికారులో నంబర్లు. ----- రాధ మండువ (కథ సరదాగా ఉండడమే కాకుండా, బొమ్మలతో చాలా అందంగా కూడా ఉంది. పిల్లలకు చూపించండి.)
 14. మంచి విత్తనాలు  --- నారంశెట్టి ఉమామహేశ్వర రావు 
 15. "వెలిగిన మిణుగురులు". ---- గుడిపూడి రాధికా రాణి.
 16. ఈ వారం కథ "పాఠం-గుణపాఠం" ----- దార్ల బుజ్జిబాబు.
 17. బడాయి రాయి ----గుడిపూడి రాధికా రాణి
 18. వెర్రిబాగుల వేరుశనగ కాయ   ---  గుడిపూడి రాధికా రాణి
 19. మామ్మకో మనవడు   -----  గుడిపూడి రాధికా రాణి
రెండవ తరగతి కథలు
 1. ఇరుకిల్లు   ---- గుడిపూడి రాధికా రాణి
 2. సుబ్బయ్య సున్నుండలు --- శాఖమూరి శ్రీనివాస్  
 3. కొబ్బరికాయల తీర్పు
 4. మనకోసం మనం  కథ: ప్రభా గాయత్రి బొమ్మలు ఆదిత్య
 5. నిర్ణయం  పివి సాయి సోమయాజులు  (అందరూ ఇలా ఆలోచిస్తే ఎంత బావుంటుందో)
 6. కోడలి దానగుణం  ---- గుడిపూడి రాధికా రాణి
 7. నమ్మకస్తుడు   ---- నందిరాజు పద్మలతా జయరాం 
 8. గడ్డిపూవు మల్లెమొగ్గ  ---- గుడిపూడి రాధికా రాణి
 9. పంచదార పిల్లి   ---- గుడిపూడి రాధికా రాణి
 10. వివేకుడి తెలివి  ---- నారంశెట్టి ఉమామహేశ్వర రావు
 11. అసలైన వజ్రం  ---- గుడిపూడి రాధికా రాణి
 12. చక్కని చుక్కలు --- గుడిపూడి రాధికా రాణి
 13. అందాల పక్షీ! నిజం తెలిసిందా? --- సి వి సర్వేశ్వర శర్మ 
 14. అదే అసలు ప్రత్యేకత --- ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి 
 15. అల్లరి చీమకు బుద్దొచ్చింది -- పుట్టగుంట సురేష్ కుమార్ 
 16. ఒక్క అవకాశం --- చొక్కాపు వెంకట రమణ 
 17. మారిన కోతి ----- రామకృష్ణ పైడిమర్రి (మనదాకా వస్తే ఎలా అలోచిస్తామో ఈ కథలో బాగా చెప్పారు)
 18. సమానం   ---- రాధికా కృష్ణ (సమానత్వం మీద కథ)
మూడు నాలుగు తరగతుల కథలుపిల్లల చదవగలిగిన చక్కని కథలు
 1. విజయం ఒక మజిలీ  నల్లాన్ చక్రవర్తుల గోపీ మాధవ్ లు
 2. పుణ్య కార్యం   జయదేవ్ గారి కార్టూన్స్ తో ఆసక్తిగా ఉందీ కథ
 3. ధర్మం  కథ మాధుర్య, బొమ్మలు ఆదిత్య
 4. మనకోసం మనం  కథ: ప్రభా గాయత్రి బొమ్మలు ఆదిత్య (చదివి తీరాల్సిన కథ) 
 5. హాపీ డేస్ నారంశెట్టి ఉమామహేశ్వర రావు Thursday, August 7, 2014

పాఠశాల తరగతులు ప్రారంభం

ఏ ఇద్దరి మధ్యైనా సత్సంబంధం ఉండాలంటే బాంధవ్యం ఒక్కటే సరిపోదు, అనురాగం ఉండాలి, దాన్ని తెలియజేసే భాష రావాలి. మన పిల్లలను చూడాలని, వారితో సంతోషంగా కాలం గడపాలని ఎంతో ఆశతో వచ్చే తల్లిదండ్రులకోసం, వారి ఆప్యాయతను పిల్లలకు చవిచూపించాలనే తపనతోనూ మొదలైనదే ఈ ‘పాఠశాల’.

ఐదేళ్ళ క్రితం తెలుగు తరగతి మొదలెట్టినప్పుడు, పుస్తకాలు లేవు. పిల్లలకు ఎలా చెపితే ఆసక్తిగా నేర్చుకుంటారో తెలియదు. కాని ఇప్పుడు పూర్తిగా ఆంగ్ల వాతావరణంలో పెరుగుతున్న పిల్లలకు తెలుగుమీద ఆసక్తి కలిగించడంలో కృతకృతులమయ్యామని గర్వంగా చెప్పుకోవచ్చు.

ఔత్సాహికులైన తల్లిదండ్రులు తెలుగు బోధించడానికి ముందుకు రావడంతో పదిమందితో మొదలైన పాఠశాలలో ప్రస్తుతం యాభైయ్యారు మంది విద్యార్ధులు తెలుగు నేర్చుకుంటున్నారు. ఈ తరగతులకు కావలసిన పాఠ్యప్రణాళికలన్నీ అందరికీ అందుబాటులో ఒకే దగ్గర ఉండాలని ఈ బ్లాగు మొదలుపెట్టడం జరిగింది. వినాయక చవితికి, సంక్రాంతికి  పిల్లలు చేసిన బొమ్మలు, నాలుగవ తరగతి విద్యార్ధులు  రాసిన ఉత్తరాలు, వ్యాసాలు, పిల్లలు వేసిన నాటికలు, వారు పాడిన పాటలు, పద్యాలు, వార్షికోత్సవం విశేషాలు అన్నీ ఇక్కడే పొందుపరిచాము. 

పాఠశాలలో విద్య పూర్తిగా ఉచితం. ఎటువంటి ప్రవేశ రుసుము లేదు. మీ ప్రాంతంలో పాఠశాల తరగతులు మొదలు పెట్టాలనుకున్నా, పాఠశాలో బోధించాలనుకున్నా, లేదా మీ పిల్లలను పాఠశాలలో చేర్పించాలనుకున్నా దయచేసి paatasalausa@gmail.com మెయిల్ చేయండి. పాఠాలు చెప్పడానికి కావలసిన పాఠ్య ప్రణాళికలు, పరిక్షా పత్రాలు అన్నీ అందజేయబడతాయి. ఉపాధ్యాయులు వారానికో గంట సమయం వెచ్చించగలిగితే చాలు.

ఆగస్టు 9 వ తేదీ శనివారం మధ్యాహ్నం 3గంటలకు ఉపాధ్యాయుల సమావేశం, ఆగస్టు 16 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తల్లిదండ్రుల సమావేశం జరుగుతాయి.

ఓ మదిలో మెదిలిన ఆలోచన వేళ్ళూనుకుని నేడు ఒక వృక్షంలా వెల్లివిరిసింది. రేపు నందనవనంలా విలసిల్లాలని ఆకాంక్షిస్తున్నాము. 

ధన్యవాదములతో,
పాఠశాల ఉపాధ్యాయులు


                                                       

Tuesday, May 27, 2014

మూడవ తరగతి వేసవి అభ్యాసము

చేసిన వారు లావణ్య కూచిభొట్ల, శైలజ వడకట్టు 
ధ్యేయం:  గుణింతాలు, త్తులు మరచిపోకుండా ఉండడం.

నాలుగు వారాల అభ్యాసము జులై 12వ  తేదీలోగా మీ ఉపాధ్యాయులకు చూపించాలి. అక్షరదోషాలు లేకుండా, స్పష్టంగా, గుండ్రంగా వ్రాయండి.  

మొదటి వారం:
‘ఉపాయము’ కథ చదివి అభ్యాసము పూర్తి చేయాలి.

          అనగ అనగా ఒక గాడిద ఉండేది. అది అడవిలో దారితప్పింది. ఆకలిగా ఉన్న ఒక నక్క ఆ గాడిదను చూసింది. తనుకు ఆహారం దొరికిందని ఎంతో సంతోషించింది. ఒక్క ఉదుటన గాడిద మీదకు దూకింది. అంతలో గాడిద పక్కకు తప్పుకుంది. "నక్క బావా! నక్క బావా! ఒక్క నిముషం ఆగు! నా వెనక కాలికి దెబ్బ తగిలింది. నీవు నన్ను తినకూడదు. తింటే నీ ఆరోగ్యం చెడుతుంది. నన్ను మన్నించు . కావాలంటే నా కాలిని చూడు". అంది. అప్పుడు నక్క గాడిద వెనకకు వెళ్ళింది. అంతే! గాడిద ఫెడీ మని ఒక్క తన్ను తన్నింది. నక్క పడిపోయింది, గాడిద పారిపోయింది.

అభ్యాసము:
ఈ క్రింది ఖాళీలను పూరించండి:

1. గాడిద ............................. దారి తప్పింది.

2. ఒక్క నక్క ఆ ................................. చూసింది.

3. నక్క పడిపోయింది, గాడిద ..........................ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు పూర్తి వాక్యాలలో వ్రాయండి :


1. అడవిలో దారి తప్పిన జంతువు పేరు ఏమిటి?


2. గాడిదను చూసిన నక్క ఏమనుకుంది?3. గాడిద నక్క నుంచి ఎలా తప్పించుకుంది?4. ఈ కథలో ఉన్న నీతి గురించి రెండు వాక్యాలు వ్రాయండి?రెండవ వారం అభ్యాసము :

భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు
1. సాహి భోజనం చేస్తోంది.

    సాహి నిన్న ----------------------------------------

    సాహి రేపు ------------------------------------------

2. హర్ష నిన్న ఆడుకున్నాడు. 
    
    హర్ష ------------------------

    హర్ష రేపు --------------------------

3. శ్రీకర్ రేపు చదువుకుంటాడు. 

    శ్రీకర్ ఇప్పుడు -----------------------------------

    శ్రీకర్ నిన్న --------------------------------------

4. సుచిర్ పాలు తాగుతున్నాడు 

    సుచిర్ నిన్న ---------------------------------

    సుచిర్ రేపు ---------------------------------------

5. సుహాని అమ్మకి సహాయం చేస్తోంది. 
  
    సుహాని నిన్న అమ్మకి ---------------------------------

    సుహాని రేపు అమ్మకి -----------------------------------

6. సాకేత్ పుస్తకం చదివాడు. 

    సాకేత్ పుస్తకం --------------------------------

    సాకేత్ రేపు పుస్తకం ----------------------------------

7. లక్కి పద్యం చెప్పాడు 

    లక్కి పద్యం --------------------------

   లక్కి రేపు పద్యం --------------------------

8. పార్థు డాన్స్ చేస్తున్నాడు 

    పార్థు  నిన్న -------------------------------

    పార్థు  రేపు -----------------------------------10. ప్రీతిక స్కూల్ కి వెళ్తోంది 
    
      ప్రీతిక నిన్న ---------------------------

      ప్రీతిక రేపు ----------------------------------

ఈ క్రింది ఖాళీలను సరైన అక్షరాలతో  పూర్తి చేయండి : 

1. ప ----  ------  ------   (mountain)

2. వా -------  -------  (bridge  )

3. వి -------  -------  లు  (students )

4. సం వ ---   -----  ------  (year ) 

5. ప -----    (bird )

6. ప ----- ---------   (exam )

7. వా -----  ------   (sentences )

8. వ -------   (rain )

9. వ్య ----  ------ -----  (farming )

10. వ్య -----  -------   (organization )

మూడవ  వారం:
ఈ క్రింది పాట చదివి అభ్యాసము పూర్తి చేయండి.
మా ఇల్లు

అందాల హరి విల్లు మా యిల్లు
మమతానురాగాలు వెదజల్లు
ప్రేమామృతపు జల్లు మా అమ్మ
వాత్సల్యముల పెల్లు మా నాన్న
ఆప్యాయతల వెన్న మా అన్న
మురిపాల సిరిచుక్క మా అక్క
నాన్నకు చేదోడు మా అన్న
అమ్మకు చేదోడు మా అక్క
అందరూ నా తోడు
నిజము మీ తోడు!
నన్ను చదివిస్తారు నన్ను ఆడిస్తారు
నన్ను నవ్విస్తారు వాళ్ళు నవ్వేస్తారు
సుఖశాంతులకు పూలవల్లి - మా ఇల్లు
ఆనందముల పాల వెళ్లి మా యిల్లు
అందాల హరి విల్లు మా యిల్లు
మమతాను రాగాలు వెదజల్లు
ఖాళీలను పూరించండి:
1.  మమతాను రాగాలు .....................
2. అందరూ నా తోడు, నిజము.............
3. నన్ను చదివిస్తారు, నన్ను..................
4. సుఖశాంతులకు .................... మా యిల్లు  


సరైన అర్ధం క్రింద గీత గీయండి :

మమత = (నాది అనే భావం; నాది కాదు అనే భావం)
అనురాగం = ( ప్రేమ; అసూయ)
జల్లు = ( వాన; మబ్బు)
మురిపెము = ( సంతోషము; బాధ)
చేదోడు = ( సహాయం; విరోధం)నాలుగవ వారం :
హో
గు
వి
ను
దీ
తి
ళీ
నా
ప్త
గా
పా
గు
గు
మి
ది
సం
ళి
వి
ను
క్రాం
త్రి
క్ష్మీ
వి
గు
తి
రా
రా
ప్త
ను
వ్ర
ప్త
రా
తి
ను
నా
భో
తం
మి
శ్రీ
తి
శి
గు
గి
సంక్రాంతి, భోగి, కనుమ, శివరాత్రి, రథసప్తమి, హోళీ, ఉగాది, శ్రీరామనవమి, వరలక్ష్మీవ్రతం, వినాయకచవితి, దీపావళి, దసరా
** పైన ఇచ్చిన పండుగల గురించి ఒక 5 వాక్యాలు వ్రాయాలి: 
ఐదవ వారం :
 ఇటు చదివితే ఒకటి, అటు చదివితే మరొకటి: (ఇందులో ఒక 5 పదాలకు అర్ధం వ్రాయండి)

1. కంకి కింక
2. తల - లత
3. రమ మర
4. కలప- పలక
5. పడక- కడప
6. పడగ- గడప


ఎటు చదివిన ఒకటే
(తెలుసా మీకు?), ఏవైనా ఐదు పదాలకు, వాక్యాలు వ్రాయండి :

 కిటికీ
 కనక
 పులుపు
 టమాట
వికటకవి
కునుకు
జలజ
మడమ
కులుకుగీతగీసిన అక్షరాన్ని తొలగించిచూడు :

o డి                బడి

అంబలి        ............

వాలు        .............

వాలు         ..............

పొడ            .............

పొగడ           ...............

లోపాలు            ...............


అనుకరణ పదాలు
(పదాలను ఎలా, ఎక్కడ వాడుతారో, తెలుసుకుని ఐదు పదాలకు వాక్యాలు వ్రాయండి)

గలగల
చకచక
కరకర
పకపక
సలసల
టపటప
తళతళ


ఆరవ వారం :

ఈ సారి మీ అమ్మ నాన్నల తో కలిసి కూరలు కొనటానికి వెళ్ళి, అక్కడ కనీసం ఒక 5 రకాల కూరలు, 3 రకాల పళ్ళు  పేర్లు తెలుసుకొని వాటి గురించి ఒక 4-5 వాక్యాలు వ్రాయాలి. వీలయితే వాటి బొమ్మలు కూడా జత పరచండి. 

ఈ క్రింది పర్యాయ పదాలను రెండు సార్లు వ్రాయాలి. 
పక్షి      =   పిట్ట


వృక్షము =  చెట్టు


కల       =   స్వప్నము


నేల       =   భూమి


ప్రదేశం    =   స్థలము


నెల       =   మాసము


పాము   =    సర్పము


జలము  =    నీళ్ళు


రవి      =    సూర్యుడు


వెన్నెల   =   కౌముది


గీతము   =   పాట


మనసు    =  మది 

ఏడవ వారం
ఏకవచనం చివరలో 'వస్తే బహువచనంలో 'లుతో ముగుస్తుంది.
ఏకవచనము
అర్ధము
బహువచనము
పలక    


గంట     


మెలిక   


కల        


పంట    


కర్ర      


చీర        


కూర      


పత్రిక    


కళ      


మొక్క


జడ      


మాట    


చిలక     


ప్రతిమ  


గోడ        


చుక్క     


కాయ    


నెల        


మొలక  


గడప      


మొగ్గ      


బాధ      ఏకవచనం చివరలో 'వస్తే బహువచనంలో 'లుతో ముగుస్తుంది.
ఏకవచనము
అర్ధము
బహువచనము
వారము

అక్షరము

క్షణము

మనిషి  

అమ్మాయి  

మిఠాయి  

కాకి          

వస్తువు        

సంచి          

కోతి              


గిన్నె          


చేయి          


రాత్రి            


రోజు            


బంతి          

ఏకవచనం చివరలో 'వస్తే బహువచనంలో 'లు'తో ముగుస్తుంది.
ఏకవచనము
అర్ధము
బహువచనము
తలుపు          


పుస్తకము      


వురుము        


చెట్టు              


గట్టు              


స్నేహితుడు    


పువ్వు    


చెప్పు            


పండు            


గ్లాసు              


చినుకు          


మెరుపు          


చీపురు          


బండి              


తిట్టు            ఏకవచనం చివరలో 'వస్తే బహువచనంలో 'ళ్ళు'తో ముగుస్తుంది.
కాలు       కాళ్ళు
గోరు        గోళ్ళు
కన్ను      కళ్ళు
వేలు        వేళ్ళు
పన్ను      పళ్ళు
నీరు         నీళ్ళు
ముల్లు     ముళ్లు
గడి          గళ్ళు
పొడి         పొళ్లు
బడి          బళ్ళు
బండి        బళ్ళు
కూతురు   కూతుళ్ళు
ఈ క్రింది పదాలకు బహువచనం వ్రాయండి.
ఏకవచనము
అర్ధము
బహువచనము
చక్కెర
బియ్యం
ఉప్పు
పప్పు


ఈ క్రింది పదబంధములో పదాలను కనుక్కోండి.

టె
డు
డు
లు
మ్మ
అం
రా
వు
లు
అం
టె
డు
ఒం
డు
రా
రా
అం
టె
ల్లు
లు
ము
రా
లు
గు
షి
ము
ము
టె
ను
డు
టె
పా
శా

అమ్మ , ఆవు , ఇల్లు , ఈగ , ఉడుత , ఊయల , ఋషి , ఎలుక , ఏనుగు , ఐరావతము , ఒంటె , ఓడ , ఔషధము , అందము , పాఠశాల 

ఎనిమిదవ వారం 

మీరు వేసవి సెలవులలో ఎక్కడికి వెళ్ళారు? ఎవరిని కలిశారు? ఏమి చేశారు? ఎలా గడిపారు? పది వాక్యాలలో వివరించండి.


హోం వర్క్ మొత్తం గుండ్రంగా, అందంగా వ్రాసిన వారికి బహుమతి ఉంటుంది. (Gift for the best and special writings)